Monday, 2 May 2016

12 కోట్ల రూపాయల విలువైన డైమండ్ చోరీ...

సిసిటీవీ రికార్డర్‌ కూడా ఎత్తుకెళ్లారు 

చండీఘర్‌: 12 కోట్ల రూపాయల విలువైన వజ్రం చోరీ అయింది. చండీఘర్‌లోని ఫర్ ఎవర్ షో రూం నుంచి ఈ డైమండ్‌ను చోరీ చేశారు. సాయుధులైన ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. వెళ్తూ, వెళ్తూ సిసిటీవీ రికార్డర్ కూడా ఎత్తుకెళ్లారు. చోరీ ఘటన కలకలం రేపడంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు ముమ్మరం చేశారు. చుట్టుపక్కల షాపుల సిసిటీవీల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా దుండగులు వచ్చిన వాహనాలు, వెళ్లిన మార్గాల ద్వారా ఆచూకీ కనుగొనేందుకు యత్నిస్తున్నారు.

No comments:

Post a Comment