Monday, 23 May 2016

సింహాల బోనులోకి దూకి .. సింహాలనే..


  శాంటియాగో (చిలీ): అది అతని అదృష్టమో, దురదృష్టమో చెప్పలేం. ఆత్మహత్య చేసుకోవడానికి జంతు ప్రదర్శనశాల (జూ)లో ఉన్న సింహాల బోనులోకి దూకినా, రెండు సింహాలు ఓకేసారి తనపై దాడి చేసినా.. సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. తాను చావడానికి సింహాల బోనులోకి దూకి రెండు సింహాల ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు.
    చిలీకి చెందిన ఫ్రాంకో లూయిస్‌ (20) అనే యువకుడు శాంటియాగోలోని జూలోకి వచ్చి సింహాల బోనులో దూకాడు. వెంటనే బట్టలిప్పేసి సింహాలకు ఆహారమైపోదామని నిర్ణయించుకున్నాడు. ఆతడిని చూసిన ఓ ఆడ సింహం, మగ సింహం దాడి చేశాయి. ఈ విషయం జూ భద్రతా అధికారులకు తెలిసింది. వారు వెంటనే అక్కడకు పరిగెత్తుకు వచ్చారు. మొదట మత్తు మందు అమర్చిన బాణాలు వేసి సింహాలను ఆపుదామనుకున్నారు. కానీ, సమయానికి అవి అందుబాటులో లేకపోవడంతో వేరే దారి లేక తుపాకులతో ఆ రెండు సింహాలనూ కాల్చి చంపారు. కాగా, లూయిస్‌ జేబులో ఓ సూసైడ్‌ నోట్‌ ఉంది.

No comments:

Post a Comment