సన్‌రైజర్స్ జట్టు గెలుపుకు ఛాన్స్ ఉన్న పెద్ద వార్త..
బెంగుళూరు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఐపిఎల్ తుది
పోరు మొదలైంది. టాస్ గెలిచిన డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే సన్‌రైజర్స్ ముఖ్య బౌలర్ ముస్తఫిజర్
రెహ్మాన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ బంగ్లాదేశీ బౌలర్ పొట్టి క్రికెట్‌లో
ఉత్తమ బైలర్‌గా చెలరేగుతున్నాడు. గాయాల కారణంగా గత కొన్ని మ్యాచ్‌లకు
దూరమైన ముస్తఫిజర్‌ను వార్నర్ పట్టుబట్టి మరీ జట్టులోకి తీసుకున్నట్టు
సమాచారం. ఎందుకంటే బౌలింగే హైదరాబాద్ జట్టుకు బలం. నెహ్రా కాలికి ఆపరేషన్
కారణంగా మ్యాచ్‌కు దూరం కాగా, ముస్తఫిజర్ కూడా అందుబాటులో ఉండడేమో
అనుకుంటున్న తరుణంలో అభిమానులకు శుభవార్త చెప్పాడు కెప్టెన్ వార్నర్.

No comments:
Post a Comment