Monday, 9 May 2016

        సూర్యుడి మీదుగా బుధుడి ప్రయాణం.. ఇలా!

ఫ్లోరిడా: ఆకాశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. దాదాపు పదేళ్ల తర్వాత బుధగ్రహం సూర్యుడి ముందు నుంచి తన పయనాన్ని ప్రారంభించింది. అమెరికా కాలమానం ప్రకారం.. ఉదయం 7 గంటలకు బుధగ్రహం సూర్యుడి ముందు నుంచి వెళ్లే దృశ్యం కన్పించింది. దాదాపు ఏడున్నర గంటలపాటు ఈ గ్రహయానం సూర్యుని ముందుగా సాగనుంది.
బుధగ్రహం సూర్యుడి ముందు నుంచి వెళ్లే సమయంలో ఒక నల్లని చుక్కలాంటి ఆకారం ఆకాశంలో కన్పిస్తుంది. ప్రస్తుతం అమెరికా, కెనెడా, పశ్చిమ యూరప్‌లలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యాస్తమయం అయ్యే లోపు భారత్‌లోనూ కన్పించనుంది.
2006లో ఒకసారి ఇలా కన్పించింది. మళ్లీ మూడేళ్ల తర్వాత మరోసారి బుధగ్రహం సూర్యుడి ముందు నుంచి పయనిస్తూ కన్పిస్తుంది. ఆ తర్వాత 2032లో ఇలా జరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక దశాబ్దంలో 13 సార్లు ఇలా బుధుడు వెళ్లాడని నాసా పేర్కొంది. బుధ గ్రహ పయనాన్ని తమ వెబ్‌సైట్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యక్ష ప్రసారంలో చూడొచ్చని నాసా తెలిపింది.


No comments:

Post a Comment