Friday, 13 May 2016

వెండితెరపై మరో వారసుడు

    తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రస్తుతం వారసులతో కళకళలాడుతుంది. బాల నటుల నుండి యంగ్ హీరోస్ వరకు వెండితెరపై నటించేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వారసులు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తుండగా.. తాజాగా మరో వారసుడు ఈ లిస్ట్ లోకి చేరనున్నట్టు సమాచారం. పూరి జగన్నాధ్ , కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీ ద్వారా ఆ వారసుడి ఎంట్రీ ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

       నందమూరి కళ్యాణ్ రామ్, పూరి జగన్నాద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీలో కళ్యాణ్ రామ్ జర్నలిస్ట్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే నెలలో సెట్స్ పైకి తీసుకెళ్ళనుండగా, మూవీకి సంబంధించిన ఓ వార్త అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కళ్యాణ్ రామ్ తనయుడు 'శౌర్య రాం' పూరి చిత్రం ద్వారా వెండితెర కు బాల నటుడిగా పరిచయం కానున్నాడు . ఇటీవల శౌర్య ని చూసిన పూరి జగన్నాద్ అతడి చేత నటింప జేయడానికి పూనుకున్నట్లు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ కూడా అప్పట్లో బాబాయ్ బాలకృష్ణ తో ''బాల గోపాలుడు '' చిత్రంలో నటించిన విషయం తెలిసిందే .

No comments:

Post a Comment