Friday, 13 May 2016

ఐఏఎస్‌ అధికారుల విభజనను పూర్తి...

      తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్‌   అధికారుల విభజన పూర్తయింది. ఐఏఎస్‌ అధికారుల విభజనపై డీవోపీటీ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. విభజనలో భాగంగా తెలంగాణకు 41 మంది ఐఏఎస్‌లు పెరిగారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఐఏఎస్‌ల సంఖ్య 167 ఉండగా... తాజా పెంపుతో 208కి చేరింది. వీరిని శాఖల వారీగా అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది.
అధికారుల కేటాయింపు ఇలా..
*  సీఎస్‌+ ఇద్దరు స్పెషల్‌ సీఎస్‌లు
*  ముఖ్య కార్యదర్శి స్థాయి- 16
*  కార్యదర్శి స్థాయి- 18
*  కమిషనర్‌ స్థాయి- 19
*  కలెక్టర్లు-10
*  జాయింట్‌ కలెక్టర్లు-11
*  డైరెక్టర్లు- 21
*  ప్రాజెక్ట్‌ డైరెక్టర్లు - 5
*  జీహెచ్‌ఎంసీ కమిషనర్లు -3
*  స్పెషల్‌ కలెక్టర్లు(ఐ అండ్‌ క్యాడ్‌)-3
*  విజిలెన్స్‌ శాఖకు ఒకరు
*  టీఎస్‌పీఎస్‌సీకి ఒకరు
*  ఈసీ డిప్యూటి సీఈఓగా ఒకరు
*  సీసీఎల్‌ఏ కార్యదర్శిగా ఒకరు
*  కమర్షియల్‌ ట్యాక్స్‌ జాయింట్‌ కమిషనర్‌గా ఒకరు
*  కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్లపై 45 మంది

No comments:

Post a Comment