Thursday, 19 May 2016

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు చేదువార్త !

నీట్‌కు దీటుగా తెలంగాణ ఇంటర్‌మీడియట్ సిలబస్‌ 

  • ఇంటర్‌ బోర్డు కసరత్తు.. తప్పదంటే మార్పులు 
  •  21న సమావేశం కానున్న సిలబస్‌ కమిటీ 
  •  సీబీఎస్‌ఈ పుస్తకాలతో కుస్తీ వద్దు: నిపుణులు 
        
ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాలను నీట్‌ ఆధారంగానే చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ పరీక్షకు అనుగుణంగా సిలబ్‌సలో మార్పులపై తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు కసరత్తు చేస్తోంది. నీట్‌ను సీబీఎ్‌సఈ సిలబస్‌ ఆధారంగా నిర్వహిస్తున్నారు. తదనుగుణంగా రాష్ట్ర సిలబ్‌సనూ పూర్తిస్థాయిలో తీర్చిదిద్దనున్నారు. ఈ మార్పులపై చర్చకు 21న బోర్డు సిలబస్‌ కమిటీ భేటీకానుంది. అయితే నీట్‌పై సందిగ్ధం కొనసాగుతున్నందున తుది నిర్ణయం వెలువడ్డాకే కార్యాచరణకు దిగనున్నట్లు సమాచారం. ఈ ఏడాదికి నీట్‌ తప్పనిసరి అయితే మాత్రమే సిలబ్‌సలో తక్షణ మార్పులు చేయాలని, వాయిదా పడితే వచ్చే యేడాది కోసం చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే నీట్‌ సిలబ్‌సను కమిటీసభ్యులు పరిశీలించగా రాష్ట్ర సిలబస్‌ 80శాతం వరకు సీబీఎ్‌సఈ సిలబ్‌సలాగే ఉందని, 20శాతం మార్పు సరిపోతుందని సబ్జెక్టు నిపుణులు తెలిపారు. ఫిజిక్స్‌, కెమిసీ్ట్ర సబ్జెక్టులు సీబీఎ్‌సఈతో దాదాపుగా సమానంగా ఉన్నట్లు తెలిపారు. బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో మాత్రం సీబీఎస్ ఈ సిలబస్‌కన్నా ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు.
ప్రస్తుత సిలబస్‌‌తో నీట్‌కు సిద్ధమైన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందీ లేదంటున్నా రు. విద్యార్థులు, తల్లిదండ్రులు సీబీఎస్‌ఈ ఫిజిక్స్‌, కెమిస్ట్రీ , బయాలజీ పుస్తకాల కోసం ప్రయత్నిస్తున్నారని, ఈ సమయంలో వాటివల్ల గందరగోళం తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పుస్తకాలనే పక్కాగా చదివేలా ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. మరోవైపు నీట్‌ తప్పనిసరైతే ఆ ప్రశ్నపత్రం తెలుగులోనే ఉండవచ్చు. 2013లో సుప్రీం కోర్టు 7 రాషా్ట్రలకు స్థానిక భాషలోనే నీట్‌ నిర్వహించుకునేలా అనుమతించినట్లు, వాటిలో తెలుగు రాషా్ట్రలు కూడా ఉన్నట్లు నిపుణులు తెలిపారు.

సీబీఎస్‌ఈ సిలబస్‌ కన్నా మన సిలబస్‌లో అదనంగా ఉన్న అంశాలు

జువాలజీ: ఫస్టియర్‌: ఆవరణశాస్త్రం, ఏకకణజీవుల పరిణామం, ప్రత్యుత్పత్తి.
సెకండియర్‌: మానవ పరిణామం, వ్యాధి నిరోధక శాస్త్రం
బాటనీ: వృక్ష ఆవరణ శాస్త్రంలోని నీటి మొక్కలు, ఎడారి మొక్కలు, సమోద్భీజాలు, అంతర్‌నిర్మాణ; బాహ్య స్వరూప అనుకూలనాలు. సూక్ష్మ జీవశాస్త్రంలోని బ్యాక్టీరియా, వైరస్‌లపై అంశాలు. అదే విధంగా వృక్ష శాస్త్ర పరిధి, వృక్షశాస్త్ర శాఖలు
కెమిస్ట్రీ: ఎక్స్‌రేల స్ఫటిక విజ్ఞానం, నార్మాలిటీ, ఘనస్థితి.

ఎంసెట్‌- నీట్‌ల మధ్య ప్రధాన తేడాలు
ఎంసెట్‌
160 ప్రశ్నలు.. 3గంటలు..160 మార్కులు
ప్రశ్నకో మార్కు.. నెగటివ్‌మార్కులుండవు
ఇంటర్‌ మార్కులకు 25శాతం వెయిటేజీ
సబ్జెక్టుకు 40 మార్కుల చొప్పున ప్రశ్నలు
బయాలజీ రెండుగా విభజించి ఉంటుంది

ఫిజిక్స్‌లో 90శాతం లెక్కల రూపంలో, 10శాతం థియరీ రూపంలో ప్రశ్నలు వస్తాయి.
ప్రాక్టికల్‌ ప్రశ్నలు ఉండవు
నీట్‌
180 ప్రశ్నలు.. 3గంటలు..720 మార్కులు
పశ్నకు 4మార్కులు.. తప్పుకొక మార్కు కోత
ఇంటర్మీడియట్‌ మార్కుల వెయిటేజీ ఉండదు
ఫిజిక్స్‌-45, కెమిస్ట్రీ -45, బయాలజీ-90 మార్కులు బయాలజీ ఒకే విధంగా ఉంటుంది. బోటనీలో ఎక్కువ, జువాలజీలో తక్కువ ప్రశ్నలు వస్తాయి.
60శాతం లెక్కల రూపంలో, 40శాతం థియరీ రూపంలో ప్రశ్నలుంటాయి.
ప్రాక్టికల్‌ ప్రశ్నలు కూడా ఉంటాయ
 

No comments:

Post a Comment