Saturday, 14 May 2016

పత్రాల్లేకుండా రూ.570 కోట్లా..!

    తమిళనాడులోని తిర్పూర్‌లో మూడు కంటెయినర్లలో రూ.570కోట్లు పట్టుబడటంపై సినీ నటుడు విశాల్‌ స్పందించారు. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో పెద్ద మొత్తంలో డబ్బు స్వాధీనమైంది. డాక్యుమెంట్లు లేకుండా 570కోట్ల రూపాయలు పట్టుబడ్డాయా... అని విశాల్‌ ట్విట్టర్‌ ద్వారా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ డబ్బు అంతటినీ చిన్నారుల విద్య, మధ్యాహ్న భోజన పథకం కోసం ఉపయోగిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ఎంతో మంది చిన్నారులకు ఈ డబ్బు సరిపోతుందని అభిప్రాయం వ్యక్తంచేశారు.
ఎన్నికల తనిఖీల్లో భాగంగా తిర్పూర్‌లో 3 కంటైనర్లలో తరలిస్తున్న రూ.570కోట్లు, కోయంబత్తూరు సమీపంలో మరో రెండు కంటైనర్లలో తరలిస్తున్న రూ.195 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు చెందినదని తరలిస్తున్న వ్యక్తులు చెబుతున్నారు. బ్యాంకులకు చెందిన నగదో కాదో ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు.

No comments:

Post a Comment