ఇంట్లో ఒక్క తులసి చెట్టు ఉంటే చాలు పూర్తి ఆరోగ్యం మీ వెంటే...
కానీ తులసి మాత్రం రోజులో 22 గంటల పాటు ఆక్సిజెన్ (ప్రాణ వాయువు) ను విడిచిపెడుతుందని మన భారతీయుల పరిశోధనలో తేలింది. వృక్షజాతిలో మరే మొక్కకు ఈ ప్రత్యేకత లేదు. తులసి ఔషధ గని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారు. తులసికి ఉన్న ఘాటైన వాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు. అందుకే మనం సంప్రదాయంలో ఇంటి ముందు, వెనుకా కూడా తులసి మొక్కను పెట్టి పూజించమన్నారు, ఫలితంగా ఇంట్లోకి పాములు రాకుండా ఉంటాయి. తులసిలో విద్యుఛ్చక్తి అధికంగా ఉందని ఆధునిక వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. వేదంలో కూడా వృక్షాల్లో ఉన్న విద్యుత్ గురించి ప్రస్తావన ఉంది. తులసి ఏ ఇంటిలో ఉంటే, ఆ ఇంటి మీద పిడుగు పడదని పరిశోధకులు తేల్చారు. తులసిలో ఉన్న ఈ విద్యుత్ శక్తిని మనం శరీరం గ్రహిస్తే, ఆరోగ్యం చేకూరుతుంది, అందుకోసమే తులసమ్మకు నీరు పోసి, చుట్టు ప్రదక్షిణం చేయాలి. అప్పుడు తులసిలో ఉన్న శక్తి భూమి ద్వారా, ఆరికాళ్ళలోకి చేరి, నాడీ మండలాన్ని ప్రభావితం చేస్తుంది.
తులసి ఎంత
గొప్పదంటే, తులసి వనంలో పెట్టిన శవం ఎంతకాలమైనా చెడిపోదని మన ఆయుర్వేద
గ్రంధాలు చెప్పాయి. దీన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కూడ అంగీకరించారు.
ప్రపంచాన్ని హడలుగొట్టిన స్వైన్‌ప్లూ భారత్‌లో స్వైరవిహారం చేయకుండా
అడ్డుకున్నది తులసి మొక్కేనని తేలింది. తులసి గాలి కారణంగా జనంలో
స్వైన్‌ప్లూను తట్టుకునే రోగనిరోధక శక్తి పెరిగిందట. తులసమ్మ మనకు ఆయుషు
పెంచుతుంది. ఏ ఇంట్లో అధికంగా తులసి మొక్కలు ఉంటాయో, ఆ ఇంట్లోవారు
ఆరోగ్యంగా ఉంటారు. తులసి చెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది.
తాజ్‌మహల్ కాలుష్యం బారినపడి మసకబారకుండా ఉండడం కోసం, తాజ్‌మహల్ పక్కనే,
లక్ష తులసి మొక్కల వనాన్ని ప్రత్యేకంగా పెంచారు. అట్లాగే, తులసి చెట్టు
దగ్గర చేసే ప్రాణాయామం, ధ్యానం, యోగా మరిన్ని మంచి ఫలితాలని ఇస్తాయి.
కాలుష్య జీవనంలో కనీసం మనిషి ఒక తులసి మొక్కైనా పెంచాలి. నల్గొండ జిల్లాలో
ఫ్లోరోసిస్ వ్యాప్తిని తగ్గించడానికి ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేస్తోంది.
తులసి ఆకులు నీటిలోని ఫ్లోరోసిస్ వ్యాప్తిని తగ్గిస్తాయని ఈమధ్యే
దృవీకరించారు. మనం పెరటి తులసిని సక్రమంగా వాడుకుంటే, రూపాయి ఖర్చు లేకుండా
అనేక మంది జీవితాల్లో వెలుగు నింపవచ్చు. అందుకే తులసి మొక్కను ప్రతి ఇంట
పెంచాలంటున్నారు.

No comments:
Post a Comment