న్యూయార్క్:
ప్రపంచంలోనే అత్యధిక కాలం పాటు
ఆరోగ్యంగా జీవించి గిన్నిస్
రికార్డుకెక్కిన బామ్మ గురువారం
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో
కన్నుమూసింది. సుసన్నా ముషాత్
జోన్స్(116) వృద్ధాప్యంతో కన్నుమూసినట్లు
ఆమె కుటుంబసభ్యులు తెలిపారు.
దీంతో ఇప్పటి వరకు జోన్స్ పేరున
ఉన్న రికార్డు ఇప్పుడు ఇటలీకి
చెందిన ఎమ్మా మొరానో మార్టిన్జు(116)కి
వచ్చినట్లు ఓ పరిశోధన బృందం
వెల్లడించింది.
జోన్స్ యూఎస్‌లోని అలబామాలో 1899లో జన్మించింది. ఆమె చిన్నపిల్లల సంరక్షకురాలిగా, హౌస్‌కీపర్‌గా పనిచేసింది. మిస్ సుసీగా పేరొందిన ఆమె 116వ పుట్టినరోజు సందర్భంగా జులై 7న జరిగిన వేడుకలకు కుటుంబ సభ్యులే కాక పలువురు స్థానిక ప్రముఖులు హాజరై ఆమెతో ముచ్చటించారు. శతాధిక వృద్ధురాలైనా జోన్స్ ఆరోగ్యంగా ఉండటానికి గల కారణం ఏమిటని గతంలో అడిగినప్పుడు ఆమేం చెప్పారో తెలుసా.. వేళకు నిద్రపోవడం, ధూమపానం, మద్యపానాలకు దూరంగా ఉండడమేనట.

No comments:
Post a Comment