లండన్:
ఇప్పుడు నడుస్తున్నదంతా స్మార్ట్ యుగం. ప్రతీ మనిషికీ ఫోన్ అత్యవసర
వస్తువుగా మారిపోయింది. ఫోన్‌లో చార్జింగ్ లేకపోతే ఏదో ముఖ్యమైన అవయవం
దెబ్బతిన్నటే బాధపడుతుంటారు. అయితే అలాంటి బాధ ఇక అవసరం లేదు. ఇప్పటి వరకు
ఫోటోస్, వీడియోస్‌తోపాటు బ్యాలెన్స్ కూడా షేర్ చేసుకోవచ్చు అన్న విషయమే
మనకు తెలుసు. అయితే ఇకపై చార్జింగ్ కూడా ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్‌కు
షేర్ చేయవచ్చట.
ఈ టెక్నాలజీని లండన్ పరిశోధకులు
అందుబాటులోకి తేనున్నారు. పైగా ఇది పూర్తిగా వైర్‌లెస్ టెక్నాలజీ.
వైర్‌లెస్ పవర్ ట్రాన్స్‌ఫర్ (డబ్ల్యూపీటీ)తో అత్యవసర సమయాల్లో
చార్జింగ్‌ను మరో ఫోన్ నుంచి షేర్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు.
ప్రస్తుతానికి దీనిని ‘పవర్ షేక్’ అని పిలుస్తున్నారు. పవర్
ట్రాన్స్‌మిట్ కాయిల్స్ సహాయంతో ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్‌కు
చార్జింగ్‌ను బదిలీ చేసుకోవచ్చు. ఇలా ఒక ఫోన్ నుంచి మరో ఫోన్‌కు 12
సెకెన్ల పాటు చార్జింగ్ షేర్ అయితే.. దాని సహాయంతో ఒక నిమిషం పాటు
మాట్లాడవచ్చు.

No comments:
Post a Comment