Wednesday, 13 July 2016

చిరంజీవి 150వ సినిమాలో విజయశాంతి?

మెగాస్టార్ ‘కత్తిలాంటోడు’గా రీఎంట్రీ ఇస్తోన్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్‌ కంప్లీట్ చేసి...రెండో షెడ్యూల్‌కు రంగం సిద్ధం చేశారు చిత్రయూనిట్. అయితే ఈ చిత్రంలో చిరు సరసన ఎవరు నటిస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇదిలాఉంటే.. ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది. దాదాపు 9 ఏళ్ల తర్వాత చిరంజీవి హీరోగా రీఎంట్రీ ఇస్తోన్న ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి కూడా రీఎంట్రీ ఇవ్వనుందనే టాక్ టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలనాటి హీరోయిన్ కమ్ రాజకీయ నాయకురాలైన విజయశాంతిని చిరు చిత్రంలో ఓ కీలక పాత్రకోసం చిత్రయూనిట్ సంప్రదించారని సమాచారం. దర్శకుడు వినాయక్‌తో పాటు చిరంజీవి కూడా ఆ పాత్రకు విజయశాంతి ఫర్ఫెక్ట్‌గా సెట్ అవుతారని భావిస్తున్నారట. విజయశాంతి కూడా ఈ చిత్రంలో నటించేందుకు పాజిటివ్‌గానే స్పందిచినట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటించలేదు. చిరు, విజయశాంతి కాంబినేషన్‌లో గతంలో అనేక సూపర్ హిట్ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. లేడీ అమితాబ్‌గా పేరుగాంచిన విజయశాంతి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలూ చేశారు. ఒక వేళ చిరు 150లో చేసేందుకు విజయశాంతి అంగీకరిస్తే 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఆమె స్క్రీన్‌పై కనిపిస్తారు. వీరిద్దరూ కలిసి నటిస్తే సినిమాపై మరింత అంచనాలు పెరిగే అవకాశం ఉంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

No comments:

Post a Comment