Saturday, 16 July 2016

17 ఏళ్ల అబ్బాయి... 19 ఏళ్ల అమ్మాయి ప్రేమించి పెళ్లిచేసుకుంటే...

గుర్గావ్: ఆ కుర్రాడికి 17 సంవత్సరాలు. ఆ యువతి వయసు 19 సంవత్సరాలు. దాదాపు రెండేళ్ల క్రితం 2014లో ఇద్దరూ ఫేస్‌బుక్‌లో కలిశారు. వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ప్రేమ పక్షుల్లా విహరించారు. పెద్దలు కూడా వీరి ప్రేమను అంగీకరించడంతో కథ సుఖాంతమైంది. 2015 సెప్టెంబర్‌లో పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లయి సరిగ్గా పదినెలలు కూడా పూర్తి కాలేదు. భార్యపై పెంచుకున్న ప్రేమ కాస్తా ద్వేషంగా మారింది. ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు. అయితే అతను మాత్రం తప్పించుకోవాలనుకున్నాడు. ఓ పక్కా ప్లాన్ వేశాడు. బలవంతంగా పెళ్లికి ఒప్పించి చెబుతున్నా వినకుండా మైనర్‌గా ఉన్న తనను పెళ్లి చేసుకుందని పోలీస్ స్టేషన్‌లో భార్యపై కేసు పెట్టాడు. తనను చాలాసార్లు వేధింపులకు గురిచేసిందని తెలిపాడు. ప్రస్తుతం ఆ యువకుడు ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. భర్త చేసిన పనితో విస్తుపోయిన ఆ యువతి కూడా తెలివిగా ఆలోచించి కేసు పెట్టింది.
 
తనను రేప్ చేశాడని, అందువల్లే తనను పెళ్లి చేసుకుని న్యాయం చేయమని కోరానని చెప్పింది. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తనను వదిలించుకోవాలని చూస్తున్నాడని కేసు పెట్టింది. పెళ్లి కాక ముందు ఆ యువకుడు అశోక్ విహార్‌లో, యువతి సుభాష్ నగర్‌లో ఉండేవారని పోలీసులు తెలిపారు. ఆ కుర్రాడి బంధువుల్లో ఒకరు మళ్లీ చేసుకోవాలని సూచించడమే గొడవంతటికీ కారణమని పోలీసుల విచారణలో తేలింది. అయితే పెళ్లి ఫోటోల్లో ఆ కుర్రాడి తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఆశీర్వదించారని, బాల్య వివాహాన్ని ప్రోత్సహించినందుకు వారిపైన కూడా కేసు నమోదు చేస్తామని ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ సునీల్ కుమార్ తెలిపారు.

No comments:

Post a Comment