Tuesday, 12 July 2016

తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉధృతం..175 గేట్లు తెరిచిన ధవళేశ్వరం

కరీంనగర్: కాళేశ్వరం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. గోదావరి, ప్రాణహిత నదులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.మంథని, మహదేవ్‌పూర్‌ డివిజన్‌లో భారీ వర్షం సంభవించడంతో పెద్దంపేట, లెంకలగడ్డ, పంకెనవాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో సుమారు 25 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి.
 
 ఆంధ్రప్రదేశ్‌లో రాజమండ్రి వద్ద గోదావరిలో వరద నీరు పెరుగుతుంది. గోదావరి వరద ఉధృతి పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లును తెరవడం జరిగింది. దీని ద్వారా 1.82 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్లుతోంది. ఈ సాయంత్రానికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశముందని నిపుణులు తెలుపుతున్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచిస్తున్నారు

No comments:

Post a Comment