నమ్మలేకున్నా
ఇది నిజం.. నేటి యువత రోజుకు రెండున్నర గంటలు ఫోన్‌పైనే గడిపేస్తోంది.
పదులు కాదు.. వందలు కాదు.. వేల సంఖ్యలో స్మార్ట్‌ఫోన్లను స్పృశిస్తూ
బతికేస్తోంది. సగటున రోజూ 2,617 సార్లు ఫోన్లను తాకుతున్నారని తాజా
అధ్యయనం గుర్తించింది. మోస్తరుగా ఫోన్‌ను ఉపయోగించే వారు 2.42
గంటలు వీటిపైనే గడుపుతున్నట్లు తేలింది. ఇక ఎప్పుడూ ఫోన్లకే అతుక్కుపోయే
వారైతే మరింత సమయం ఫోన్‌పైనే వెచ్చిస్తున్నట్లు గుర్తించారు. అమెరికాలోని
ఎస్‌కౌట్ సంస్థ ఒక అధ్యయనం నిర్వహించింది. భిన్న ప్రాంతాలకు చెందిన
94 మంది ఆండ్రాయిడ్ వినియోగదారులను పరిశీలించింది. ప్రత్యేకంగా సిద్ధంచేసిన
స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌ను ఇచ్చి.. ఐదు రోజులపాటు వినియోగదారులు
ఎన్నిసార్లు స్మార్ట్‌ఫోన్ తెరలను తాకారు? ఏ ఏ అప్లికేషన్లు చూశారు? తదితర
సమాచారాన్ని సేకరించింది.
ఎప్పుడూ ఫోన్‌కి అతుక్కుపోయేవారు..
ఫోన్‌పై వెచ్చించే సమయం: 3.75 గంటలు టచ్‌లు: 5,427 యాప్‌ల వాడకం : 132 సార్లు
ఎప్పుడూ ఫోన్‌కి అతుక్కుపోయేవారు..
ఫోన్‌పై వెచ్చించే సమయం: 3.75 గంటలు టచ్‌లు: 5,427 యాప్‌ల వాడకం : 132 సార్లు

No comments:
Post a Comment