దిల్లీ: ప్రపంచంలోనే అతి చౌకైన స్మార్ట్‌ఫోన్ ‘ఫ్రీడమ్ 251’ను శుక్రవారం నుంచి వినియోగదారులకు అందించనున్నట్లు రింగింగ్ బెల్స్ వెల్లడించింది. రూ.251కే విక్రయిస్తామని గత ఫిబ్రవరిలో ఈ సంస్థ ప్రకటించడంతో, 7 కోట్ల మంది పేర్లు నమోదు చేసుకోగా, 30,000 మంది డబ్బులు కూడా చెల్లించారు. ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వారిలో 5,000 మందికి తొలివిడతగా ఫోన్లు అందించనున్నట్లు రింగింగ్ బెల్స్ డైరెక్టర్ మోహిత్ గోయెల్ తెలిపారు. ముందుగా డబ్బులు కట్టనివారు, రూ.40 రవాణా రుసుముతోపాటు కలిపి, మొత్తం రూ.291 చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై వచ్చే నష్టాన్ని పూడ్చుకునేందుకు హైక్ మెసేంజర్, భారతీ సాఫ్ట్‌బ్యాంక్ వెంచర్ వంటి వాటితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. రూ.699-999 మధ్య నాలుగు ఫీచర్ ఫోన్లు, రూ.3,999-4,499 మధ్య రెండు ఆండ్రాయిడ్ ఫోన్లు, పవర్‌బ్యాంకులను కూడా సంస్థ ఆవిష్కరించింది. ఆగస్టు 15 నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి. గురువారం ఇక్కడ రూ.9,990 విలువైన 31.50 అంగుళాల హెచ్‌డీ ఎల్‌ఈడీ టీవీలను ఆవిష్కరించిన సందర్భంగా ఈ విషయాలను గోయెల్ వెల్లడించారు.
Friday, 8 July 2016
రూ.251 ఫోన్ల సరఫరా నేటి నుంచి...

Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment