Tuesday, 12 July 2016

సుల్తాన్‌ కలెక్షన్స్‌ రూ.344 కోట్లు!

సల్మాన్‌ ఖాన్‌ సినిమాలంటే ఏ స్థాయిలో రికార్డులు సాధిస్తాయో ఇక చెప్పనక్కర్లేదు.సుల్తాన్‌ విడుదలైన ఐదు రోజులకే ప్రపంచవ్యాప్తంగా రూ.344.5 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు వెల్లడించారు. నాలుగో రోజు కలెక్షన్‌తోనే ‘సుల్తాన్‌’ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అనుష్క కథానాయికగా నటించిన ఈ చిత్రం విడుదలైన తొలిరోజు అంటే బుధవారం ఓవర్‌సీస్‌లో 20.4కోట్లు సాధించింది. గురువారం 18.5 కోట్లు, శుక్రవారం 18.8 కోట్లు, శనివారం 19.8 కోట్లు, ఆదివారం 14.5 కోట్లు గ్రాస్‌ కలెక్షన్లు రాబట్టింది. ఇండియాలో ఐదు రోజులకు 252.5 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లతో కలిసిప్రపంచవ్యాప్తంగా రూ.344.5 కోట్లు గ్రాస్‌ కలెక్షన్లు రాబట్టినట్లు విశ్లేషకులు వెల్లడించారు.

No comments:

Post a Comment