Sunday, 3 July 2016

గుర్రం తలలో 35కిలోల కొకైన్‌

మెక్సికోలోని మాదక ద్రవ్యాల వ్యాపారులు సరుకును తరలించడానికి కొత్త పద్దతులు కనుగొంటున్నారు. మెక్సికో నుంచి న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్లకు తరలిస్తున్న 35కిలోల కొకైన్‌ను న్యూజిలాండ్‌ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు 10 మిలియన్‌ డాలర్లు ఉంటుంది. వజ్రాలను పొదిగినట్లు తలిపించే ఓ మూడుఅడుగుల గుర్రం తల బొమ్మను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. దీనిని పరిశీలించగా వారికి 35కిలోల కొకైన్‌ దొరికింది. ఈ సందర్భంగా ఇద్దరు మెక్సికన్‌ జాతీయులను అరెస్టు చేశారు. దీనికోసం ఇక్కడి పోలీసులు ఆరువారాలుగా దర్యాప్తు నిర్వహిస్తున్నారు. న్యూజిలాండ్‌ చరిత్రలోనే ఇదో అతిపెద్ద మాదకద్రవ్యాల పట్టివేత అని లిబాస్‌ అనే అధికారి తెలిపారు.

No comments:

Post a Comment