సూపర్‌స్టార్ రజనీకాంత్
నటించిన కబాలి చిత్రం జులై 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి
తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో విడుదల చేయడానికి
చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా... అమెరికాలో 400
స్ర్కీన్లలో కబాలి చిత్రాన్ని ప్రదర్శించేందుకు ప్లాన్ చేశారు. విడుదలకు
ముందు రోజున కూడా ప్రత్యేక ప్రీమియర్ షోలను ఏర్పాటు చేసినట్లు
తెలిసింది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సినీ గెలాక్సీ ‘కబాలి’ని
అమెరికాలో రిలీజ్ చేస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో కబాలి చిత్రాన్ని
అమెరికాలో రిలీజ్ చేస్తున్నారు. అమెరికాలో ఇంత భారీ ఎత్తున రజనీ
చిత్రాన్ని రిలీజ్ చేయడం ఇదే తొలిసారి అని సినీ గెలాక్సీ ప్రతినిధి మధు
గార్లపాటి తెలిపారు. కబాలి టికెట్ల బుకింగ్ ఇప్పటికే అమెరికాలో
మొదలైంది. బుకింగ్ మొదలైన రెండు గంటల్లోనే మొత్తం టికెట్లు
అమ్ముడుపోయినట్లు సినీ గెలాక్సీ ప్రతినిధి తెలిపారు. ప్రీమియర్ షో కోసం
టికెట్ ధరను 25 డాలర్లుగా నిర్ణయించినట్లు తెలిపారు. పా.రంజిత్
దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ అందించిన సంగీతం
హైలెట్‌గా నిలిచింది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ ‘కబాలి’ ఫుల్
జోష్‌లో ఉంది. సూపర్‌స్టార్ రజనీ గ్యాంగ్‌స్టర్‌గా నటించిన ఈ చిత్రంపై భారీ
అంచనాలు ఉన్నాయి.

No comments:
Post a Comment