వచ్చే నెలలో ‘మొహంజదారో’తో
ప్రేక్షకుల ముందుకు రాబోతున్న స్టార్ హీరో హృతిక్ రోషన్ స్టార్ టీవీతో
కుదుర్చుకున్న ఓ భారీ డీల్ ఇప్పుడు బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. తర్వాత
రాబోతున్న తన ఆరు సినిమాల శాటిలైట్ హక్కులను ఆయన రూ.550 కోట్లకు అమ్మేశాడు.
గతంలో హృతిక్ నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద విజయ కేతనం ఎగురవేడయంతో ఈ
డీల్‌ను కుదుర్చుకునేందుకు స్టార్ టీవీ ముందుకొచ్చింది. ప్రస్తుతం తన
సొంతబ్యానర్‌పై హృతిక్ తెరకెక్కిస్తున్న కాబిల్ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో
రిపబ్లిక్ డే నాడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సెట్స్‌పైకి కూడా
వెళ్లకముందే దాని శాటిలైట్ హక్కులను రూ.45 కోట్లకు విక్రయించాడు. కాగా
గతంలో బాలీవుడ్ కండల వీరుడు, సుల్తాన్ సల్మాన్ ఖాన్ కూడా ఓ చానెల్‌తో
ఇటువంటి ఒప్పందమే కుదుర్చుకున్నాడు. ఇప్పుడు ఇదే బాటలో యువనటుడు వరున్
ధావన్ కూడా చేరాడు. జుడ్వా-2 తర్వాత వచ్చే తన అన్ని సినిమా హక్కులను ఓ టవీ
చానెల్‌కు రూ.300 కోట్లకు కట్టబెట్టాడు.

No comments:
Post a Comment