Sunday, 10 July 2016

వాట్సాప్‌కు పోటీనిస్తున్న 6 యాప్‌లు

వాట్సాప్‌ను ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించుకుంటున్న సంగతి తెలిసిందే. తనకు వంద కోట్ల యూజర్లు ఉన్నారని వాట్సాప్ చెప్పుకుంటోంది. కానీ దీనికి శత్రువులు లేకపోలేదు. ఓ మోస్తరు పోటీనిస్తున్న 6 యాప్‌ల గురించి ఇప్పుడు చూద్దాం. వీటిలో వాట్సాప్‌లో లేని ఫీచర్లు ఉండటం గమనార్హం.
 
హైక్ : తనకు 10 కోట్ల యూజర్లు ఉన్నారని హైక్ ఇటీవల ప్రకటించింది. ఆండ్రాయిడ్, ఐ ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్‌ ఫోన్లలో దీనిని ఉపయోగించుకోవచ్చు. దీనిలో ఆఫీస్ చాట్ ఫెసిలిటీ ఉంది. స్టిక్కర్ కలెక్షన్ కూడా ఉండటం మరో విశేషం. నాన్ హైక్ మెంబర్స్‌‌కు కూడా ఉచితంగా మెసేజ్‌లు పంపుకోవచ్చు.
 
కకావోటాక్ : మన దేశంలో దీనికి అంతగా ప్రాచుర్యం లేదు. కానీ వాట్సాప్‌కు ఇది బలమైన శత్రువు అని చెప్పవచ్చు. 15 భాషల్లో ఇది లభిస్తోంది. వీడియో కాలింగ్ వంటి వాట్సాప్‌లో లేని ఫీచర్లు ఉన్నాయని ఈ యాప్ చెప్తోంది. యూజర్ మొబైల్ నెంబరు అవసరం లేకుండా కేవలం కటాక్ ఐడీ ఉంటే ఈ యాప్‌ను వాడుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐ ఆపరేటింగ్ సిస్టమ్, బడా ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ ఫోన్లలో వాడుకోవచ్చు.
 
ఫేస్‌బుక్ మెసెంజర్ : దీనిలో స్టిక్కర్ల సముద్రం ఉందని చెప్పవచ్చు. దీనిలోని గేమ్స్ చిన్నవే అయినా వ్యసనంగా మార్చగలిగే సామర్థ్యం ఉంది. కస్టమైజేషన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.
 
లైన్ : ఈ యాప్‌లో టైమ్‌లైన్, కూపన్లు, వీడియో స్నాపింగ్, 1 జీబీ వరకు ఫైల్ షేరింగ్ చేసుకోవచ్చు.
టెలిగ్రాం : వాట్సాప్‌లో లేని అనేక ఫీచర్లు టెలిగ్రామ్‌లో ఉన్నాయి. 1.5 జీబీ వరకు ఫైల్ షేర్ చేసుకోవచ్చు. 1,000 మంది యూజర్ల వరకు గ్రూప్స్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.
 
బీబీఎం : వాట్సాప్‌లో లేని ఫీచర్లు కూడా దీనిలో ఉన్నాయి. బ్లాక్‌బెర్రీ తాలూకు ఈ ఇన్‌స్టంట్ మెసెంజర్ మరింత శక్తిమంతమైన గ్రూప్ అడ్మిన్స్‌ను ఇస్తుంది. వీడియో చాటింగ్, సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ మెసేజ్ టైమర్ ఉన్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్, బ్లాక్‌బెర్రీ ఓఎస్‌లలో పనిచేస్తుంది.

No comments:

Post a Comment