Sunday, 3 July 2016

భార్య తనతో గడిపిన వీడియోలను భర్తకు పంపిన లవర్ !

కాలేజీలో వారిద్దరూ క్లాస్‌మేట్స్. ఇద్దరూ బీటెక్‌లో చేరారు. ఫస్టియర్‌లో పరిచయం ఏర్పడింది. సెకండియర్‌కొచ్చేసరికి ఆ పరిచయం కాస్తా ఇష్టంగా మారింది. అయితే  ఆ ఇష్టం హద్దులు దాటింది. తెలిసీతెలియని కుర్రతనంలో ఇద్దరూ తప్పు చేశారు. టైమ్‌పాస్‌గా సాగిన వారిద్దరి ప్రేమ బీటెక్ పూర్తయ్యే సరికి ముగిసిపోయింది. ఆ యువతి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందు జరిగినవన్నీ మర్చిపోవాలని ఆ యువకుడికి చెప్పింది. తానిప్పుడు వేరే వ్యక్తి భార్యనని... దయచేసి తనను ఇబ్బంది పెట్టొద్దని చెప్పింది. అతను కూడా ఆమె అభిప్రాయానికి సరే అన్నాడు. రోజులు గడిచాయి. ఆమె కాపురం సజావుగా సాగుతోంది. ఇంతలోనే ఏదో కలవరం. అది మరెవరి వల్లో కాదు. ఆ లవర్ వల్లే. ఆమెకు మాటిచ్చిన అతను ఆ మాటపై నిలబడలేదు.
 
ఇద్దరూ ఏకాంతంగా గడిపిన వీడియోలను అశ్లీల వెబ్‌సైట్లలో పెట్టేశాడు. తానేదో గొప్పపని చేసినట్లు ఇరుగుపొరుగున ఉన్న కుర్రాళ్లకు సీడీలను పంచాడు. అంతేకాదు, యువతి భర్తకు ఆ కాపీలను పంపించాడు. దీంతో కాపురంలో చిచ్చు రేగింది. క్షణకాలంలో చేసిన పొరపాటు ఆ యువతి జీవితాన్ని నాశనం చేసింది. ఈ ఘటన హైద్రాబాద్‌లోని మాదాపూర్‌లో జరిగింది. నిందితుడు రూపేష్‌ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. అతను ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తూ మాదాపూర్‌లో కార్ వాష్ సెంటర్ నడుపుతున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రూపేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెబ్‌సైట్స్ నుంచి ఆ వీడియోలను డిలీట్ చేసినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు.

No comments:

Post a Comment