పసుపు ఆకులు :- పసుపు ఆకుల్ని గ్రైండ్ చేయాలి. ఆ పొడిని ఒక గ్లాస్ పాలలో కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది.
అల్లం :-
గ్యాస్ సమస్యకు మంచి మందు అల్లం. దీనిని చిన్న ముక్కగా చేసి రోజూ
భోజనానికి ముందు నమిలి తీసుకుంటే చాలా మంచిది. తిన్నగా నమలలేకపోతే చక్కెర
కలుపుకుని తినొచ్చు.
బంగాళాదుంప :- బంగాళా
దుంపల్ని గ్రైండ్ చేసి ఆ జ్యూస్‌ను రోజూ భోజనానికి ముందు తాాగాలి. ఇలా
చేస్తే గ్యాస్ సమస్య నుంచి త్వరగానే ఉపశమనం పొందొచ్చు.
వెల్లుల్లి :-
గ్యాస్ సమస్యకు వెల్లుల్లి చాలా చక్కటి సహజసిద్ధమైన మందు. దీనిని తిన్నగా
నమిలాలి. లేదా వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర విత్తనాలు, జీలకర్ర గింజలు
తీసుకుని ఐదు నిమిషాలపాట నీళ్లలో ఉడికించాలి. ఈ ద్రావణాన్ని తాగితే గ్యాస్
సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.
దాల్చిన చెక్క :- దాల్చిన చెక్కను నీటిలో వేసి ఉడికించాలి. తర్వాత ఆ జ్యూస్‌ను తాగాలి. ఇలా రోజూ భోజనానికి ముందు తాగితే గ్యాస్ సమస్య పోతుంది.
యాలకులు :- రోజూ రెండు, మూడుసార్లు యలకులు నములుతూ ఉంటే గ్యాస్ సమస్య పోతుంది.
పెప్పర్మెంట్ :- గ్యాస్ సమస్యకు పెప్పర్మెంట్ టీ ఎంతో మంచిది. ఇది హెర్బల్ టీ కాబట్టి రోజుకు రెండు నుంచి మూడుసార్లు తాగితే ఎంతో మేలు.
కొబ్బరి నీళ్లు :-
గ్యాస్ సమస్యను తీర్చేందుకు కొబ్బరి నీళ్లు మంచి మందు. ఇందులో అసాధారణ
ప్రోటీన్లు ఉంటాయి. రోజూ కొబ్బరి నీళ్లను తాగడం అలవాటు చేసుకుంటే మంచిది.
యాపిల్ సైడర్ వెనిగర్ :- వేడినీటిలో మూడు టేబుల్ స్పూన్స్ యాపిల్ సైడర్, వెనిగర్ వేసుకుని తాగాలి.
కొత్తిమీర :-
అజీర్తి నిర్మూలనకు కొత్తిమీర బాగా పనిచేస్తుంది. కడుపులో మంటగా
ఉన్నప్పుడు కొత్తిమీర తీసుకుంటే చాలా త్వరగా తగ్గిపోతుంది. ఒక గ్లాస్
మజ్జిగలో కొత్తిమీర వేసుకుని తాగితే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
నల్ల మిరియాలు :- మిరియాలను పాలలో కలిపి తాగితే గ్యాస్ సమస్య తీరుతుంది.
ఇంగువ :- ఒక
గ్లాస్ లో వేడినీటిని తీసుకుని, అందులో ఇంగువ వేసుకుని బాగా కలిపి
తాగాలి. ఇలా చేస్తే గ్యాస్ సమస్య, కడుపు నొప్పి, అజీర్థి తగ్గిపోతాయి.
No comments:
Post a Comment