సెంట్రల్ ఆస్ట్రేలియాలోని ఎలైస్ స్ప్రింగ్స్ డిజర్ట్ పార్క్‌లో భారీ వైల్డ్‌లైఫ్ షో జరుగుతోంది. ఈ ప్రదర్శన తిలకించేందుకు వివిధ ప్రాంతాలనుంచి సందర్శకులు తరలివచ్చారు. ఇంతలో ఓ పెద్ద గద్ద ఓ గుంపు వద్దకు చేరుకుంది. అక్కడ ఒంటరిగా కనిపించిన 8 ఏళ్ల బాలుడికి సమీపంలో తిరుగుతూ తన కాళ్లతో బాలుడి ఆకుపచ్చ చొక్కాను పట్టుకొని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది. బాలుడు భయంతో కేకలు పెడుతూ పరుగులు తీశాడు. దాంతో అందరూ అప్రమత్తమై కేకలు వేసి తరిమేయడంతో గద్ద ఎగిరివెళ్లిపోయింది. బాలుడికి ముఖంమీద స్వల్ప గాయమైంది. దీన్నంతా ఓ సందర్శకుడు కెమెరాలో బంధించాడు. ఈ ఘటన అనంతరం ఆ ప్రదర్శనను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
జులై 6న జరిగిన ఈ ఘటనపై పార్కు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. దీనిపై విచారణ చేపడుతున్నామని.. ఆ గద్దను ప్రదర్శన నుంచి తొలగించామని వెల్లడించారు.

No comments:
Post a Comment