వినాయక
విగ్రహాల ఎత్తు తగ్గించాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి హైకోర్టు
సూచనలు జారీ చేసింది. నగరంలో నిర్వహించే వినాయక చవితిలో వినాయక విగ్రహాల
ఏర్పాటుపై దాఖలైన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.
హైదరాబాద్‌లో పరిమితికి మించి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారని, దీని వల్ల
పర్యావరణ పరిరక్షణ దెబ్బతింటుందని, అలాగే విగ్రహాల తరలింపులో ఇబ్బందులు
ఏర్పడుతున్నాయని పిటిషన్ దాఖలైంది.
పిటిషన్‌ను
స్వీకరించిన హైకోర్టు విగ్రహాల ఎత్తుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
వినాయక విగ్రహాల ఎత్తు 15 అడుగులకు మించి ఉండరాదని ఆదేశించింది. అలాగే పూజా
సామగ్రి, ప్రసాదాల కోసం మహారాష్ట్ర తరహాలో స్పెషల్ టిన్స్ ఏర్పాటు
చేయాలని తెలిపింది. విగ్రహాల ఎత్తు పేరిట హైదరాబాద్‌లో అభివృద్ధిని
అడ్డుకోవద్దని పేర్కొంది. ఈ వ్యవహారంపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని
ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

No comments:
Post a Comment