Monday, 18 July 2016

తెలంగాణాలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయకుంటే ఆమరణదీక్ష

మద్యం మహమ్మారికి ఎందరో బలవుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో గాంధీ జయంతి రోజైన అక్టోబరు 2 నుంచి సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని బంగారు తెలంగాణ పార్టీ (బీటీపీ) డిమాండు చేసింది. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయడంలో సీఎం కేసీఆర్ విఫలమైన నేపథ్యంలో అక్టోబరు 2వ తేదీ నుంచి తాము ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని బంగారు తెలంగాణ పార్టీ కన్వీనర్ అమానుల్లాఖాన్ డిమాండు చేశారు. సోమవారం హైదరాబాద్ లో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం తాగి మరణించిన వారి సంఖ్య గణనీయంగా పెరిగాయన్నారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్య పాన నిషేధం అమలు చేయకుంటే తాను మరణించే దాకా ఆమరణ దీక్ష చేపడతామన్నారు. ఈ సమావేశంలో బీటీపీ నేతలు సతీరెడ్డి, షేక్ రహీం, అజీముద్దీన్, ఫారూఖ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment