మెగాపవర్ స్టార్ రామ్
చరణ్.. మెగా అభిమానులతో పాటు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి, బాబాయి
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కి గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నాడట. తన తండ్రి
పుట్టిన రోజు ఆగస్టు 22న ఈ కానుకను ఇవ్వబోతన్నట్లు సమాచారం. చెర్రీ
ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ధృవ’గా తెరకెక్కబోతున్న సంగతి
తెలిసింది. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మెగాస్టార్ బర్త్‌డే గిప్ట్‌గా
ఇచ్చేందుకు చరణ్ సిద్ధం చేస్తున్నాడట. తమిళంలో ఘన విజయం సాధించిన ‘తని
ఒరువన్’కి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ చరణ్
పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 7న విడుదల
చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నారట. అలాగే సెప్టెంబర్ 2న పవర్
స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర పాటలను రిలీజ్ చేయాలని
భావిస్తున్నారట. ఇటీవలే కశ్మీర్‌లో షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం
ప్రస్తుతం హైదారబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో చరణ్
సరసన రకుల్ ప్రీత్‌సింగ్ జోడీకట్టగా...నవదీప్, అరవింద్ స్వామి, పోసాని
కృష్ణమురళి కీలకపాత్ర పోషిస్తున్నారు.

No comments:
Post a Comment