ముంబై:
బాలీవుడ్ నిర్మాత మేనల్లుడిపై రేప్ కేసు నమోదైంది. ఆ కేసు పెట్టింది మరెవరో
కాదు అతని భార్య. తన భర్త వేధిస్తున్నాడంటూ బాధితురాలు పోలీసులను
ఆశ్రయించింది. తన భర్త నగలన్నీ తీసుకున్నాడని, తిరిగి ఇచ్చేందుకు
నిరాకరిస్తున్నాడనేది ఆమె ప్రధాన ఆరోపణ. అంతేకాకుండా తనను వేధించేవాడని,
ఇష్టం లేకపోయినా శృంగారం చేయాలంటూ బలవంతం చేసేవాడని తన ఆవేదనను వ్యక్తం
చేసింది. ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసుకున్న వెర్సోవా పోలీసులు
నిందితుడిపై కేసు నమోదు చేశారు. నిందితుడిపై 376(రేప్), సెక్షన్
498(ఏ)(భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించినందుకు) సెక్షన్ల కింద కేసు నమోదు
చేశారు. నిర్మాతకు సంబంధించిన ప్రొడక్షన్ హౌస్ బాధ్యతలు నిందితుడు
చూసుకునేవాడని తెలుస్తోంది.

No comments:
Post a Comment