అబూజా:
నైజీరియాకు చెందిన ఈ వ్యక్తి ఓ విషయంలో అరుదైన రికార్డు సొంతం
చేసుకున్నాడు. అతడు ఏకంగా 13 మందిని పెళ్ళి చేసుకున్నాడు. ఇదేమీ పెద్ద
విషయం కాకపోయినా వారంతా ఏక కాలంలో గర్భం దాల్చడం విశేషం. 13 మంది భార్యలు
తమ ఏకైక భర్తతో ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు.
అంతేకాదు
ఎలాంటి గొడవలు లేకుండా ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. ఏక కాలంలో గర్భం
దాల్చడం పట్ల కూడా వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నిండు
చూలాలైన ఈ 13 మంది భార్యలు మూడు నుంచి ఐదు వారాల తేడాతో బిడ్డలకు
జన్మనివ్వనున్నారు. దీంతో ఆ వ్యక్తి ఏక కాలంలో 13 మంది సంతానానికి
తండ్రయ్యే ఘనత కూడా త్వరలో సాధించనున్నాడు.

No comments:
Post a Comment