Thursday, 7 July 2016

పురుషాంగమే అతణ్ని కాపాడింది!


జాగ్రెబ్‌ (క్రొయేషియా): ఇది నిజంగా అద్భుతం. పిడుగుపాటుకు గురైన ఓ వ్యక్తిని అతని పురుషాంగం కాపాడింది. అవును.. పురుషాంగాన్ని ఎర్త్‌గా ఉపయోగించుకుని ఆ హైవోల్టేజ్‌ విద్యుత్‌ బయటకు వచ్చేసిందట. సాధారణంగా టీవీలు, వాషింగ్‌ మెషీన్‌లు వంటి వాటికి ఎర్త్‌ కనెక్షన్‌ కూడా ఉంటుంది. దాని ద్వారా అధిక విద్యుత్‌ బయటకు పోతుంది. ఆ ఎర్త్‌ గనక లేకపోతే ఆ వస్తువు షాక్‌ కొడుతుంది.
 
క్రొయేషియాలోని పెట్రోవ్‌కి అనే గ్రామానికి చెందిన జొరాన్‌ జుర్కోవిక్‌ (41) అనే వ్యక్తి సైకిల్‌ మీద వెలుతున్నాడు. ఆ సమయంలో అతనిపై పిడుగు పడింది. తలలో ప్రవేశించిన అధిక వోల్టేజి విద్యుత్‌ అలా కిందకు వచ్చేస్తే గుండె, ఊపిరితిత్తులు వంటి కీలక అవయవాలన్నీ దెబ్బతినేవే. అయితే ఆ సమయంలో అతను ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకుని ఉండడం వల్ల, ఆ విద్యుత్‌ హెడ్‌ఫోన్స్‌ కేబుల్‌ గుండా ప్రయాణించింది. అనంతరం అతని పురుషాంగాన్ని ఎర్త్‌గా ఉపయోగించుకుని ఆ హై వోల్టేజ్‌ విద్యుత్‌ బయటకు వచ్చేసింది. దీంతో అతను స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

No comments:

Post a Comment