జమ్మూ: ట్యూషన్‌కు
వచ్చే ఓ విద్యార్థిపై రెండేళ్ళుగా అత్యాచారానికి పాల్పడుతున్న టీచర్‌ను
పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్మూకశ్మీర్‌లోని ఆర్ఎస్ పురాకు చెందిన బోధ్
రాజ్ 2014 నుంచి ట్యూషన్‌కు వచ్చే ఓ విద్యార్థిని లైంగికంగా
వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని ఆమెను
భయపెట్టాడు. రెండేళ్ళకు ధైర్యం చేసిన ఆ బాలిక తన తల్లికి జరిగిదంతా
చెప్పింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలికకు వైద్య పరీక్షలు
నిర్వహించి నిర్థారించారు. అనంతరం ఆ కీచక టీచర్‌ను అరెస్ట్ చేశారు.
ఆ
ఉపాధ్యాయుడికి గతంలో నేర చరిత్ర ఉందని పోలీసులు చెబుతున్నారు. 1999లో ఓ
మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న బోధ్ రాజ్, వారిద్దరు కలిసి ఆమె భర్తను
హత్య చేశారు. ఈ కేసులో పదేళ్ళ జైలు శిక్ష కూడా అనుభవించారు. 2012లో జైలు
నుంచి విడుదలయ్యాక ఇద్దరు కలిసి జీవించారు. ఆ తర్వాత ఆ మహిళ అనుమానస్పదంగా
మృతి చెందింది. దీంతో ఆర్ఎస్ పురాకు వచ్చి ట్యూషన్ సెంటర్ పెట్టాడు. బోధ్
రాజ్ గత నేర చరిత్ర తెలియడంతో అతడు మరింత మంది విద్యార్థినులపై
అత్యాచారాలకు పాల్పడి ఉంటాడని, వారు భయంతో నోరువిప్పడం లేదని పోలీసులు
అనుమానిస్తున్నారు.

No comments:
Post a Comment