అల్లరి నరేష్ కథానాయకుడిగా
నటించిన ‘సెల్ఫీరాజా’ చిత్రాన్ని
ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు
తీసుకువస్తున్నారు. నరేష్
తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ
విషయాన్ని తెలుపుతూ తెలుగు
సినిమా ట్వీట్‌ను రీట్వీట్
చేశారు. ఇవాళ ఈ చిత్రంలోని ‘బంపర్
ఆఫర్’ అనే పాటను విడుదల చేసినట్లు
పేర్కొంటూ.. పాటను అభిమానులతో
పంచుకున్నారు. సాక్షి చౌదరి,
కమాన్న రణవత్ ఈ చిత్రంలో కథానాయికలుగా
నటించారు. జి. ఈశ్వర్‌రెడ్డి
దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి
చలసాని రామబ్రహ్మం చౌదరి నిర్మాతగా
వ్యవహరిస్తున్నారు. సాయికార్తీక్
సంగీతం సమకూర్చారు. సెల్ఫీ పిచ్చితో
ఓ కుర్రాడు పడిన పాట్లు ఎలాంటివన్నదే
ఈ చిత్రం. సోనాక్షి చౌదరి ‘జేమ్స్‌బాండ్’
చిత్రం తర్వాత అల్లరి నరేష్‌తో
కలిసి నటించిన చిత్రమిది.

No comments:
Post a Comment