సునీల్, మన్నారా చోప్రా జంటగా
రూపుదిద్దుకున్న ‘జక్కన్న’
చిత్రాన్ని ఈ నెల 22న ప్రేక్షకుల
ముందుకు తీసుకువస్తున్నారు.
హీరో సునీల్ తన ట్విట్టర్
ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలిపారు.
అందరికీ వినోదం పంచడం కోసం జులై
22న వస్తున్నట్లు ట్వీట్ చేశారు.
వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం
వహించిన ఈ చిత్రానికి దినేష్
సంగీతం సమకూర్చారు. ఆర్. సుదర్శన్‌రెడ్డి
నిర్మాతగా వ్యవహరిస్తున్న
ఈ చిత్రానికి సి. రామ్‌ప్రసాద్
సినిమాటోగ్రఫీ అందించారు. ఎందుకూ
పనికిరాడు అనిపించుకున్న ఓ
యువకుడు తనని తాను శిల్పంలా
తీర్చిదిద్దుకొన్న వైనం ఎలాంటిదనే
కథతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు
ఇటీవల నిర్మాత తెలిపారు.

No comments:
Post a Comment