ఔరంగాబాద్:
కేవలం 30 రూపాయల కోసం కక్కుర్తి పడి ఆవేశంలో ఓ వ్యక్తిని చంపేశాడు గణేష్
రఘునాథ్ (20) అనే వ్యక్తి. పది రోజులపాటు ఎవరికీ తెలియకుండా ఆ శవాన్ని
దాచేశాడు. కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కేసు ఛేదించి
గణేష్‌ను అరెస్ట్ చేశారు. నాందేడ్ జిల్లాకు చెందిన గణేష్, ఔరంగబాద్‌లోని
రామేశ్వర్ శ్రీరామ్ (75) అనే వ్యక్తి ఫ్యాక్టరీలో వాచ్‌మెన్‌గా
పనిచేస్తున్నాడు. అతని జీతం గంటకు 20 రూపాయలు. ఏ రోజు డబ్బులు ఆ రోజు
తీసుకుని వెళ్లిపోతాడు. అయితే పది రోజుల క్రితం తాను గంటన్నర సమయం అదనంగా
పనిచేశానని, తనకు 30 రూపాయలు ఎక్కువగా ఇవ్వాలని శ్రీరామ్‌కు చెప్పాడు
గణేష్. ఆ డబ్బులు ఇవ్వడానికి శ్రీరామ్ నిరాకరించాడు.
ఎంతగా
బతిమాలినా ఆ 30 రూపాయలు ఇచ్చేందుకు శ్రీరామ్ ఒప్పుకోలేదు. దీంతో ఆవేశపడిన
గణేష్ పక్కనే ఉన్న ఇనుప పార తీసుకుని శ్రీరామ్‌ను హత్య చేశాడు. శవాన్ని
ఏం చేయాలో తెలియక ఆ ఫ్యాక్టరీలో ఉన్న క్లోజ్‌డ్ యూనిట్‌లో పడేశాడు. ఎంతకీ
శ్రీరామ్ ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఆ శవాన్ని కనుగొని గణేష్‌ను తమ స్టైల్లో ఇంటరాగేట్ చేయగానే
వెంటనే నిజం ఒప్పేసుకున్నాడు. 30 రూపాయల కోసం తానే చంపానని అంగీకరించాడు.
వెంటనే అతణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

No comments:
Post a Comment