సుబ్రతారాయ్‌కు
సుప్రీంకోర్టు ఆదేశాలు
సహారా గ్రూప్ అధినేత సుబ్రతారాయ్
పెరోల్‌ను సుప్రీంకోర్టు మరోసారి
పొడిగించింది. ఆగస్టు 3 వరకు
ఆయన పెరోల్‌ను పొడిగిస్తున్నట్లు
కోర్టు తెలిపింది. అయితే ఈలోగా
రూ. 300కోట్లు చెల్లించాలని లేదంటే
తిరిగి జైలుకు వెళ్తారని న్యాయస్థానం
స్పష్టం చేసింది. మానవతా దృక్పథంతో
పెరోల్‌ను పొడిగించామని.. దాన్ని
దుర్వినియోగం చేయకూడదని సూచించింది.
సెబీలో సహారా గ్రూప్ అవకతవకలకు పాల్పడిన నేపథ్యంలో 2014 మార్చిలో ఆయనకు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే గత మేలో రాయ్ తల్లి చనిపోవడంతో ఆమె అంత్యక్రియల నిమిత్తం కోర్టు అతడికి నాలుగు వారాల పెరోల్ ఇచ్చింది. ఆ తర్వాత పెరోల్‌ను జూలై 11 వరకు పొడగించింది. నేటితో ఆ గడువు పూర్తవడంతో విచారించిన న్యాయస్థానం పెరోల్‌ను పొడిగిస్తూనే డబ్బు కట్టాల్సిందిగా ఆదేశించింది.
No comments:
Post a Comment