సూపర్‌స్టార్ రజినీకాంత్‌ను
అభినందిస్తూ ‘ఐస్ ఏజ్-5’ చిత్ర
బృందం ఓ ప్రత్యేక వీడియోను విడుదల
చేసింది. ఇందులో బ్యాక్ గ్రౌండ్‌లో
కబాలీ.. అంటూ వస్తున్న పాట, వీడియోలో
రజినీకాంత్ డైలాగ్స్‌తో
కార్టూన్స్ చేస్తున్న సందడి
చూడడానికి చాలా సరదాగా ఉంది.
‘ఐస్ ఏజ్-5’ చిత్రం ఈ నెల 15న
ప్రేక్షకుల ముందుకు రానుంది.
పా రంజిత్ దర్శకత్వం వహించిన
కబాలి చిత్రం జులై 22న ప్రేక్షకుల
ముందుకు రానున్నట్లు సమాచారం.
ఈ చిత్రంలో రజినీకాంత్ సరసన
రాధికా ఆప్టే నటించారు. సంతోష్
నారాయణన్ చిత్రానికి సంగీతం
అందించారు. కలైపులి ఎస్ థను
చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

No comments:
Post a Comment