ఫ్రాన్స్:
పోర్చుగల్ జట్టు కొత్త చరిత్ర
సృష్టించింది. యూరో కప్-2016 విజేతగా
ఆవిర్భవించింది. ఆతిథ్య ఫ్రాన్స్
జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో
1-0 గోల్స్ తేడాతో విజయం సాధించి
తొలిసారి యూరోకప్‌ను ముద్దాడింది.
నిర్ణీత సమయంలో ఇరుజట్లు హోరాహోరీగా
పోరాడినప్పటికీ గోల్ సాధించడంలో
విఫలమయ్యాయి. దీంతో మ్యాచ్
అదనపు సమయానికి దారితీసింది.
ఫ్రాన్స్ ఆటగాడు ఢీకొనడంతో
పోర్చుగల్ స్టార్ ఆటగాడు
రొనాల్డో మోకాలికి గాయమైంది.
దీంతో అతడు మైదానాన్ని వీడాల్సివచ్చింది.
అదనపు సమయంలో 109వ నిమిషంలో ఎడర్
దాదాపు 25 యార్డుల దూరం నుంచి
బంతిని నేరుగా గోల్‌పోస్టులోకి
పంపడం ద్వారా మరుపురాని గోల్
సాధించాడు. దీంతో పోర్చుగల్
1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
విజయం సాధించిన అనంతరం పోర్చుగల్
అభిమానులు స్టేడియం లోపల, బయట
సంబరాలతో హోరెత్తించారు. ఓటమి
విషాదంతో ఫ్రాన్స్ ఆటగాళ్లు
కన్నీరుమున్నీరుగా విలపించారు.
No comments:
Post a Comment