Monday, 11 July 2016

రేపు, ఎల్లుండి బ్యాంకులు బంద్

దేశవ్యాప్తంగా జాతీయ బ్యాంకులు రెండు రోజుల పాటు మూతపడనున్నాయి. మంగళవారం, బుధవారం సమ్మెకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి. ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల విలీనం, ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణను ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై సోమవారం జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకు వెళ్ళాలని నిర్ణయించినట్లు అఖిల భారత బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సి హెచ్ వెంకటాచలం తెలిపారు. స్టేట్ బ్యాంకు ఉద్యోగ సంఘాలతో కలిసి సమ్మె చేయనున్నట్లు ఆయన వివరించారు. ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో రెండు రోజుల పాటు బ్యాంకు సేవలకు అంతరాయం కలగవచ్చని జాతీయ బ్యాంకులు తమ ఖాతాదారులకు ఇప్పటికే ముందస్తు సమాచారమిచ్చాయి.

No comments:

Post a Comment