తెలంగాణ
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహా హరితహారం ఉత్సాహంగా
కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు
పాల్గొని మొక్కలు నాటారు. మొక్కలు నాటాడం అందరి బాధ్యత అని, ప్రతీ ఒక్కరూ
మొక్కలు నాటాలని ప్రముఖులు పిలుపునిచ్చారు. నటులు చిరంజీవి, నాగార్జున,
అమల, అల్లు అర్జున్, రానా, మంచులక్ష్మి, రెజీనా తదితరలు హరితహారంలో
పాల్గొని మొక్కలు నాటారు.
స్టైలిష్ స్టార్ అల్లు
అర్జున తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బన్ని సతీమణి,
కుమారుడు, అల్లు అరవింద్ పాల్గొన్నారు. అటు కేబీఆర్ పార్కులో
రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్, నటి రెజీనా తదితరులు మొక్కలు నాటారు. ప్రతీ
ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో
హీరో చిరంజీవి మొక్కలు నాటారు. హరితహారం ఎంతో మంచి కార్యక్రమం అని
హైదరాబాద్‌ను గ్రీన్‌సిటీగా మార్చేందుకు ప్రజలంతా సహకరించాలని
పిలుపునిచ్చారు.
నానక్‌గూడలో నటుడు దగ్గుబాటి రానా
మొక్కలు నాటి ఆ ఫోటోలను ట్విట్లర్లో పోస్టు చేశారు. అన్నపూర్ణ
స్టూడియోస్‌లో హీరో నాగార్జున మొక్కలు నాటగా, ఆయన సతీమణి అమల కూకట్‌పల్లి
సప్తగిరి కాలనీలో నిర్వహించిన హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు.
మోహన్‌బాబు కుమార్తె మంచులక్ష్మీ తన సహనటులతో మొక్కలు నాటినట్లు ట్వీట్
చేశారు.
No comments:
Post a Comment