Sunday, 10 July 2016

సింహాద్రికి సంతోషం.. బాహుబలికి భయం

ఎస్‌.ఎస్‌. రాజమౌళి
‘13 ఏళ్ల క్రితం ఇదే రోజు సింహాద్రి విడుదల, చాలా సంతోషంగా ఉన్నాం. 12 ఏళ్ల తర్వాత.. బాహుబలి విడుదలకు ముందు రోజు, చాలా భయంతో ఉన్నాం’ అని ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి అన్నారు. రేపటితో ‘బాహుబలి’ విడుదలై ఏడాది గడుస్తున్న సందర్భంగా రాజమౌళి తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఈ ట్వీట్‌ చేశారు. ఎన్టీఆర్‌ హీరోగా ఆయన దర్శకత్వంలో విడుదలైన ‘సింహాద్రి’ చిత్రం విడుదల రోజు చాలా సంతోషంగా ఉన్నామని, కానీ బాహుబలి విడుదలకు ముందు ఉత్కంఠతో ఉన్నామని తెలిపారు. 2015 జులై 10న ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ‘బాహుబలి’ చిత్రం విడుదలై ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘బాహుబలి 2’ చిత్రీకరణ జరుగుతోంది.

No comments:

Post a Comment