Sunday, 10 July 2016

వీటి సహాయంతో మధుమేహాన్ని నియంత్రించుకోండి!

ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కోట్ల సంఖ్యలో ప్రజలు మధుమేహం బారిన పడుతున్నారు. అధిక బరువు, వారసత్వం, వ్యాయామం లేకపోవడం, అధిక క్యాలరీలున్న ఆహారం తీసుకోవడం మధుమేహానికి కారణం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతోపాటు కొన్ని ఆహార పదార్ధాలు తీసుకుంటే మధుమేహాన్ని సమర్థంగా నియంత్రించవచ్చట.
 
పసుపు:
పసుపులో ఉండే ‘కుర్కుమిన్‌’ అనే రసాయనిక సమ్మేళనానికి మధుమేహం రాకను ఆలస్యం చేయగలిగే శక్తి ఉందట. ఒకవేళ అప్పటికే వచ్చి ఉన్నట్టైతే దానిని అదుపులో ఉంచడంలోనూ ఇది ఉపయోగపడుతుందట. మధుమేహాన్ని నియంత్రించడంలో పసుపు పాత్ర గురించి మరిన్ని పరిశోధనలు ప్రస్తుతం జరుగుతున్నాయి.
 
దాల్చిన చెక్క:
దాల్చిన చెక్క వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయులను తగ్గించగలదని ఇప్పటికే ఎన్నో పరిశోధనల్లో రుజువైంది. అలాగే రక్తంలోని ట్రైగ్లిజరాయిడ్స్‌ను కూడా తగ్గించి ఇన్సులిన్‌ సెన్సిటివిటీని పెంచుతుంది. ఉదయాన్నే నీటిలో కానీ, కాఫీలో కానీ దాల్చిన చెక్క పొడిని కలుపుకుని తాగాలి.
 
స్ట్రాబెర్రీస్
మధుమేహం రావడానికి కారణమైన ఎల్‌డీఎల్‌ కొలసా్ట్రల్‌, లిపిడ్స్‌ను కంట్రోల్‌ చేయడంలో సా్ట్రబెర్రీస్‌లోని ఓ ప్రొటీన్‌ కీలకపాత్ర పోషిస్తుంది. సా్ట్రబెర్రీస్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తంలోని గ్లూకోజ్‌ లెవెల్స్‌ అదుపులో ఉంటాయి. దీని రుచీ కూడా బాగుంటుంది కాబట్టి దీనిని తీసుకుంటే మంచి ఫలితాలు కనబడతాయి.
 
రెడ్‌వైన్‌:
మధుమేహాన్ని నియంత్రించడంలో రెడ్‌వైన్‌ కూడా సహాయపడుతుందని ఇటీవలె శాస్త్రవేత్తలు గుర్తించారు. రెడ్‌వైన్‌లో ఉండే ‘రెస్వెరాట్రాల్‌’ అనే రసాయన సమ్మేళనం ఇన్సులిన్‌ విడుదలను ప్రేరేపిస్తుందట.
 
వీటితోపాటు ఆపిల్‌, గ్రీన్‌ టీ, చీజ్‌, యోగార్ట్‌ కూడా మధుమేహాన్ని సమర్థంగా నియంత్రిస్తాయని వివిధ పరిశోధనల్లో రుజువైంది.

No comments:

Post a Comment