కండలవీరుడు సల్మాన్‌ఖాన్
'సుల్తాన్' చిత్రం విడుదలైన తొలి రోజు నుంచి కలెక్షన్ల సునామీ
సృష్టిస్తోంది. కేవలం మొదటి మూడు రోజుల్లో 105 కోట్ల రూపాయలు వసూలు చేసి
వందకోట్ల క్లబ్‌లో చేరిపోయింది. అంతేకాదు...మొదటి మూడు రోజుల్లో రికార్డు
స్థాయిలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగా సరికొత్త
రికార్డును సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా తొలి రోజు రూ.37 నుంచి రూ.38
కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ చిత్రం...రెండోరోజు రూ.36 కోట్లు, మూడో రోజు
31.50 కోట్లు వసూలు చేసింది. గతంలో సల్మాన్ నటించిన 'భజరంగి భాయ్‌జాన్'
చిత్రం పేరిట మూడురోజుల అత్యధిక కలెక్షన్ రికార్డు ఉండగా, ఆ రికార్డును
మళ్లీ సల్మానే 'సుల్తాన్'తో బద్ధలు కొట్టారు. ఈ ఏడాది ఇంతవరకూ అత్యధిక
ఓపినింగ్స్ రికార్డు 'సుల్తాన్' కు దక్కినా, తొలిరోజు గ్రాస్ కలెక్షన్
రికార్డు సూపజ్ భర్‌జాత్య 'ప్రేమ్ రతన ధన్ పాయో' పేరిటే ఇంకా ఉంది. ఆ
చిత్రంలోనూ సల్మాన్‌ఖానే హీరో కాగా...తొలి రోజు రూ.40 కోట్ల గ్రాస్
కలెక్షన్ రాబట్టింది.

No comments:
Post a Comment