Sunday, 10 July 2016

వీణావాణి సర్జరీకి మార్గం సుగమం

ముందుకొచ్చిన ఆస్ట్రేలియా వైద్య బృందం 
          వీణావాణిలను విడదీసేందుకు మార్గం సుగమమైంది. శస్త్రచికిత్స చేసేందుకు అసే్ట్రలియాకు చెందిన వైద్య బృందం ముందుకు వచ్చింది. ఆధునిక పద్దతుల ద్వారా ఆపరేషన్‌ నిర్వహించి ఈ కవలనను వేరుచేయగలమని వారు తెలంగాణ ప్రభుత్వానికి తెలిపారు. దీంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. శస్త్ర చికిత్స ఖర్చును భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటించారు. కాగా, వీణావాణిలను శస్త్రచికిత్సతో వేరు చేసేందుకు వైద్యులు ముందుకొస్తే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఈఎ్‌సఐసీ డీన్‌ శ్రీనివా్‌సతో కలిసి దత్తాత్రేయ నిలోఫర్‌ ఆస్పత్రికి వెళ్లి వీణావాణిలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన నిలోఫర్‌ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడారు. ఆపరేషన్‌ విషయంలో వివిధ దేశాల నిపుణుల అభిప్రాయాలను వైద్యులు దత్తాత్రేయకు వివరించారు.

No comments:

Post a Comment