Friday, 15 July 2016

దగ్గుబాటి వారి చిరకాల కోరిక తీరనుందా?

‘మనం’ సినిమాతో ఓ కుటుంబమంతా కలిసి తెరపై కనపడి సందడి చేశారు అక్కినేని వారు. ఇదే రీతిన తాము ఓ సినిమా చేయాలని ఆశపడ్డారు దగ్గుబాటి వారు. రామానాయుడు గారు బ్రతికున్నప్పుడే ఇందుకోసం కొంతమంది రచయితలతో కథ సిద్ధం చేయమని పురమాయించినా అది పట్టాలెక్కలేదు. అలాంటి ప్రయత్నాలు మరికొన్ని జరిగినా అవేవీ సరైన ఫలితాన్నివ్వలేదు. తాజా సమాచారం ప్రకారం వీరి కల సాకారమయ్యే ‘క్షణం’ దగ్గర్లోనే ఉందిట. ‘క్షణం’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే సంచలన విజయాన్నందుకున్న రవికాంత్ పేరేపు దర్శకత్వంలో దగ్గుబాటి హీరోలు వెంకటేశ్, రానాలతో ఓ సినిమా రానుందిట. ‘క్షణం’ సినిమాతో రవికాంత్ ప్రతిభకు ముగ్దుడైన రానా ఆయనతో పనిచేసేందుకు ఆసక్తి కనబరిచాడట. తొలుత రానా కోసం ఓ కథ చెప్పిన రవికాంత్ తర్వాత కొన్ని మార్పులు చేసి అందులో వెంకీ పాత్రని చొప్పించారట. ఈ కథ పట్ల దగ్గుబాటి వర్గాలు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో దగ్గుబాటి వారి చిరకాల కోరిక తీరిందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అప్పట్లో దగ్గుబాటి సినిమాలో నాగచైతన్య సైతం నటించే అవకాశముందని ప్రచారం జరిగింది. ఇక రానా సోదరుడు కూడా సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ పరిస్థితులలో వీరిద్దరికీ రవికాంత్ తన కథలో చోటు కల్పిస్తాడా లేదా అన్నది ప్రస్తుతానికి అనుమానమే. చివరిగా.. ‘కృష్ణం వందే జగద్గురం’లో ఓ పాటలో ఒకే తెరపై కనపడిన వెంకీ, రానా త్వరలో పూర్తిస్థాయిలో వారి అభిమానుల్ని అలరిస్తారన్నది అసలు విషయం.

No comments:

Post a Comment