Friday, 15 July 2016

హైదరాబాద్ నగరంలో శబ్దకాలుష్యం మోత


హార్ట్‌ బీట్‌ పెరుగుతుంది. నిత్యం లో ట్రాఫిక్‌లో ప్రయాణించే నగరవాసిని శబ్దకాలుష్యం బెంబేలెత్తిస్తోంది. పగలు రాత్రి అనే తేడా లేకుండా మోత మోగిం చేస్తోంది. నిర్దేశిత ప్రమాణాలకన్నా దాదపు 15 నుంచి 30డెసిబుల్స్‌ వరకు అధికంగా నమోదవుతూ అవుతూ చెవులు దెబ్బతినేలా చేస్తుంది.  
        పంజాగుట్ట, ఆబిడ్స్‌, పారడైజ్‌ ప్రాంతాల్లో పగలురాత్రి తేడా లేకుండా అత్యధికంగా నమోదవు తున్న కాలుష్య నియంత్ర మండలి నివేదికలే వెల్లడిస్తున్నాయి నగరంలో సౌండ్‌ మోగుతోందని. ఇప్పటికే శబ్ద కాలుష్యంలో దేశంలోనే ఢిల్లీ, లక్నో తరవా త నగరం మూడో స్థానం ఆక్రమించింది. ట్రాఫిక్‌ లో 2గంటలకన్నా ఎక్కువ తిరిగేవారికి హార్ట్‌బీట్‌ పెరిగి బీపీకి దారితీస్తున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నా రు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే వినికిడి శక్తిపై తీవ్రప్రభావం చూపుతోందంటున్నారు.

సగటు కన్నా భారీగా నమోదు..

సాధారణంగా నివాసప్రాంతాల్లో పగలు 55డెసిబుల్స్‌ రాత్రి సమయంలో 45డెసిబుల్స్‌ లోపే శబ్దాలుండాలి.. అదే వాణిజ్య ప్రాంతాలైతే 65, 55గా ఉండాలి. కానీ దీనికి 20నుంచి 30డెసిబుల్స్‌ కంటే ఎక్కువగా నమోద వుతున్నాయి. ఈ సమాచారమంతా సగటు తీసుకున్న తరవాత వచ్చేవి. అదే పగలు సమయంలో ఒకే సారి చెవులు చిల్లులు పడేస్థాయిలో శబ్దాలు వెలువడుతు న్నాయి. ఒక్కోసారి 90 నుంచి 100 డెసిబుల్స్‌ శబ్దాలు కూడా వస్తున్నాయి. ఒక వ్యక్తి 60నుంచి 70 డెసిబుల్స్‌ వచ్చే చోట ఉంటే ఆ రోజు పని సామర్థ్యం 4గంటలకు పడిపోతుం దని నిపుణులు వెల్లడిసున్నారు. అదే వ్యక్తి 70నుంచి 90డెసిబుల్స్‌ శబ్దాల మధ్య ఉంటే ఏకంగా అది 2గంటలకు పడేందుకు అవకాశా లున్నాయని హెచ్చరిస్తున్నారు. సాధ్య మైనంత వరకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచి స్తున్నారు.

హారన్లతోనే ప్రధాన చిక్కు..

నగరంలో రోజుకు 45నుంచి 50లక్షల వాహనాలు రోడ్లపైకొసున్నాయని అంచనా.. దానికి అదనంగా రోజూ కొత్తగా వెయ్యి వాహనాలు రోడ్లెక్కుతున్నాయి. వీటి ప్రభావంతో వచ్చే శబ్దాలే నిర్దేశిత ప్రమాణాలు మించి పోతున్నాయి. దీనికి అదనంగా భారీ శబ్దాలొచ్చే హారన్లు వాడటంతో సమస్య మరింత జటిలమవుతోంది. 50 డెసిబుల్స్‌కన్నా ఎక్కువ శబ్దంవచ్చే హారన్లు వాడకూ డదని చట్టంలో ఉంది. కానీ అది క్షేత్రస్థాయిలో అమలు కావడంలేదు. ఏదైనా వాహనం వస్తే దానికి అన్ని పత్రాలూ సరిగా ఉన్నాయా లేదా అని గమనించే పోలీసులు హారన్‌ ఎలాంటిదని పట్టించు కోవడంలేదు. దీంతో ఇష్టారాజ్యంగా ఎస్‌యూవీ హారన్లు వినియోగిసు న్నారు. అధునాతన కార్లు, స్పోర్ట్స్‌ బైకుల నుంచి ఈ తరహా ఉల్లంఘనలు ఎక్కువ ఉంటున్నాయి.

హెల్మెటే బ్రహ్మాస్త్రం...

కార్లలో ప్రయాణించేవారు ఎక్కువగా అద్దాలు వేసుకో వడంతో సమస్య నుంచి కొంత గట్టెక్కుతారు. శబ్ద కాలుష్య బారిన పడేది ప్రధానంగా ద్విచక్ర వాహన దారులే.. వారు దీన్ని రక్షించుకోవడానికి... వారి ఆరోగ్యపై ప్రభావం చూడకుండా హెల్మెట్‌ వాడితే దాదాపు 30శాతం శబ్దాలను నిరోధిం చొచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు. దీంతోపాటు సిగ్నల్స్‌ దగ్గర, ఆగిన చోట్ల అనవసరంగా హారన్లుకొట్టకుండా అవగా హన కల్పిస్తే చాలా సమస్యలు తీరతా యి. గయాలో అధికారయంత్రాగ మంతా కలికట్టుగాపనిచేసి అనవసరంగా హారను కొట్టకూడదు అనే నినాదంతో అక్కడి ప్రజలను చైతన్యం చేసింది. ఇప్పటికైనా పోలీసులు దృష్టిసారిస్తే సమస్యకొంత తీరినట్లే..రోజుకు 2 నుంచి 4 గంటల పాటు రద్దీ ప్రాంతాల్లో, ట్రాఫిక్‌ లో కొన్ని నెలలపాటు ప్రయాణి స్తే పూర్తిగా వినికిడి శక్తికోల్పో యే ప్రమాదం ఉంది. బీపీ బాగా పెరుగుతుంది. హార్ట్‌బీట్‌ కూడా ఎక్కువ ఉండటంవల్ల చిన్న విషయాలకే ఆవేశపడటం, చికాకు కలగడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కువసేపు శబ్దాల మధ్య గడిపేవారికి మానసిక అస్తిత్వం ఏర్పడి పనిపై దృష్టి సారించలేదు. శబ్ద కాలుష్యం నుంచి రక్షించుకునే విధానాలు అవలంబించాలి. ఎక్కువసేపు ట్రాఫిక్‌లో గడిపే వారు ప్రతి 6నెలల కోసారి వినికిడి సామర్థ్యాన్ని పరీక్షించుకుంటే తేడాను బట్టి ముందుచర్యలు తీసుకోవచ్చు.

No comments:

Post a Comment