Sunday, 3 July 2016

బాలికపై అత్యాచారం, హత్య

సికింద్రాబాద్‌ బొల్లారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. పదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసి హత్యచేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బొల్లారం కలాసిగూడకు చెందిన రామకృష్ణ దంపతులు నిన్న కూలికి వెళ్లగా కూతురు ఒక్కతే ఇంట్లో ఉంది. అది గమనించిన అదే ప్రాంతానికి చెందిన అనిల్‌కుమార్‌ ఇంటి ముందు ఉన్న బాలికకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఘటన బయటకు వస్తుందనే నెపంతో బాలికను గొంతు నులిమి హత్యచేశాడు అనిల్‌కుమార్‌. నిర్మానుష్య ప్రాంతంలో విగతజీవిగా ఉన్న బాలికను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు అనిల్‌పై బొల్లారం స్టేషన్‌తో పాటు, పలు పోలీస్‌స్టేషన్‌లలో కేసులు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

No comments:

Post a Comment