కలర్స్ ఛానెల్‌లో
ప్రసారమవుతున్న ‘బాలికా వధూ’ ధారావాహిక ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న
సంగతి తెలిసిందే. తెలుగులో ఈ సీరియల్‌ను ‘చిన్నారి పెళ్లి కూతురు’ పేరుతో
ప్రసారం చేస్తున్నారు. సమాజంలో ఒకప్పటి సాంఘిక దురాచారమైన బాల్య వివాహం
నేపథ్యంలో ఈ సీరియల్‌ను తెరకెక్కించారు. బుల్లి తెర ప్రేక్షకులను ఎంతగానో
అలరిస్తున్న ఈ సీరియల్‌కు జూలై 31న ముగింపు పలికేందుకు నిర్మాతలు
సిద్ధమయినట్లు తెలుస్తోంది. దాదాపు 8 సంవత్సరాలుగా సీరియల్ అభిమానులను
ఆలోచింపజేస్తూ సాగిన కథ ఇక ముగిసిపోనుంది. జూలై 22న ‘చిన్నారి పెళ్లి
కూతురు’ సీరియల్ చివరి షూట్ జరగనుందని టాక్. అయితే అధికారికంగా ఇప్పటి వరకూ
ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ సీరియల్ మొదలైనప్పుడు ఆనందిగా అలరించిన అవికా
ఇప్పుడు పెరిగిపెద్దయి సినిమాల్లో కూడా నటించడం విశేషం.
No comments:
Post a Comment