Wednesday, 13 July 2016

కబాలి హృదయంలో.. ఆమె!

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ కథానాయకుడిగా రూపుదిద్దుకున్న ‘కబాలి’ చిత్రం కొత్త పోస్టర్‌ విడుదలైంది. ముఖంపై గాయాలతో ఉన్న రజినీకాంత్‌ హృదయాన్ని తెరుచుకుని కథానాయిక రాధికాఆప్టే కనిపిస్తున్నట్లు ఈ పోస్టర్‌లో చూపించారు. దీన్ని చూస్తుంటే చిత్రంలో రాధికాఆప్టే కోసం రజినీకాంత్‌ ఎంత పరితపిస్తుంటారో.. తెలుస్తోంది. చిత్ర దర్శకుడు పా రంజిత్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఈ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్టర్‌ కాన్సెప్ట్‌, డిజైనర్‌ విన్సి రాజ్‌ అని ట్వీట్‌ చేశారు. ఈ చిత్రంలో రజినీకాంత్‌ సరసన రాధికా ఆప్టే నటించిన సంగతి తెలిసిందే.
కబాలి ఎయిర్‌టెల్‌ సిమ్ములు!
‘కబాలి’ చిత్ర బృందం ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ.. కబాలి ఎయిర్‌టెల్‌ సిమ్ముల ఆవిష్కరణ కార్యక్రమంలో తీసిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందని, దగ్గర్లో ఉన్న స్టోర్స్‌కి వెళ్లి కబాలి ఎయిర్‌టెల్‌ సిమ్స్‌ని తెచ్చకోండని పోస్ట్‌ చేశారు. ఈ సిమ్ముల ద్వారా కబాలి ప్రత్యేక రీచార్జ్‌ ప్యాక్‌(అన్‌లిమిటెడ్‌ 2జీ), కబాలి హలో ట్యూన్స్‌, కబాలి బ్రాండెడ్‌ సిమ్‌ ప్యాక్స్‌ వంటి వసతులు కల్పిస్తున్నారట.అంతేకాదు ఈ సిమ్‌ ద్వారా అభిమానులు సూపర్‌స్టార్‌ని విష్‌ చేయవచ్చట. కస్టమర్స్‌ నుంచి వచ్చిన ప్రత్యేక సంక్షిప్త సమాచారాన్ని వారి పేరుతోపాటు పొందుపరిచి దాన్ని ఓ కాఫీ టేబుల్‌ పుస్తకంగా తయారు చేసి రజినీకి బహుమతిగా ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ నెల 22న ‘కబాలి’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

No comments:

Post a Comment