Sunday, 10 July 2016

‘పోలీసు వెట్టిచాకిరీ’పై విచారణ

హోంగార్డులతో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ పోలీస్‌ ఉన్నతాధికారి వెట్టిచాకిరీ చేయించడం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రభుత్వ వర్గాలు, ఉన్నతాధికారులు ఈ విషయంపై ఆరా తీస్తున్నారు. దీనిపై సోమవారం పూర్తి వివరాలు సేకరించి నిర్ణయం తీసుకుంటామని ఇన్‌ఛార్జి డీజీపీ అంజనీకుమార్‌ తెలిపారు. ఆర్డర్లీ వ్యవస్థను అధికారికంగా రద్దు చేసినప్పటికీ కొందరు అధికారులు గుట్టు చప్పుడు కాకుండా హోంగార్డులతో ఇంటి పనులు చేయిస్తున్నట్లు సమాచారం.
వెట్టిచాకిరీ వార్త అవాస్తవం!
హోంగార్డులతో వెట్టిచాకిరీ వార్త అవాస్తవమని రంగారెడ్డి జిల్లా ఎస్పీ నవీన్‌కుమార్‌ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణ సక్రమంగా నిర్వహించమన్నందుకే తనపై కుట్ర చేశారని ఆరోపించారు. తాను సెలవులో ఉన్న సమయంలో క్యాంపు ఆఫీసులో ఆ దృశ్యాలు చిత్రీకరించారని తెలిపారు. దీని వెనుక అదనపు ఎస్పీ వెంకటస్వామి, సీసీ మహేశ్‌ల హస్తం ఉందని ఆరోపించారు. గతంలో తాను పశువైద్యాధికారిగా పనిచేశానని, పశువులు, పక్షులపై ప్రేమతో వాటిని ఇంట్లో పెంచుకుంటున్నానని తెలిపారు. చిత్రీకరణ ఘటనపై విచారణ ప్రారంభించామని త్వరలోనే నిరూపిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.

No comments:

Post a Comment