స్మార్ట్
ఫోన్ యూజర్స్‌కు బ్యాడ్ న్యూస్ అందించింది ఓ ప్రముఖ సంస్థ. ఇక ఆ ఫోన్లకు
వాట్సాప్,ఫేస్ బుక్ పనిచేయవని సడన్ షాక్ ఇచ్చింది. ఫేస్‌బుక్‌కు చెందిన
పాపులర్ మెసేజింగ్ సర్వీస్ సింబియాన్ ఫోన్లు ఒకప్పుడు మార్కెట్‌లో బాగా
అమ్ముడుపోయాయి. అయితే అప్పట్లో ఉన్న ఓఎస్(ఆపరేటింగ్ సిస్టమ్)కు అనుగుణంగా
యాప్‌లను అందించింది. కాగా ఆ యాప్‌లు కొద్దిరోజుల తరువాత పనిచేయమని
యూజర్లకు సడన్ షాకిచ్చింది. 31/12/2016 నుంచి ఫేస్‌బుక్, వాట్సాప్
అందుబాటులో ఉండదు.. పనిచేయవని తేల్చిచెప్పారు. కాగా ఇదే విషయమై ఇప్పటికే ఈ
ఫోన్ వినియోగదారులకు నోటిఫికేషన్లు అందాయి. ఇదిలా ఉంటే.. బ్లాక్ బెర్రీ,
సింబియాన్ ఫోన్లకు వాట్సాప్ పనిచేయదన్న షాక్ నుంచి కోలుకోక మునుపే కొన్ని
రోజులకే మరో షాక్ ఇచ్చింది. బ్లాక్ బెర్రీ 10 డివైజ్ లకు మార్చి 31 నుంచి
ఫేస్ బుక్ సపోర్టును ఆపివేస్తున్నామని ఫేస్ బుక్ కంపెనీ కూడా ప్రకటించింది.
ఒకే సారి రెండు షాక్‌లివ్వడంతో యూజర్లు గగ్గోలు పెడుతున్నారు.
సింబియాన్
ఫోన్లకు వాట్సాప్ యాప్ సపోర్టు చేయకపోవడంతో నిలిపివేస్తున్నట్లు తన
అధికారిక బ్లాగ్‌లో వివరణ ఇచ్చింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ
డివైజ్ విఫలమవుతుండటంలో ఈ సర్వీసును నిలిపివేయనున్నట్టు కంపెనీలు
పేర్కొంటున్నాయి. అన్ని బ్లాక్ బెర్రీ ఓఎస్ వెర్షన్లకి, నోకియాస్ సింబియాన్
ఎస్40, సింబియాన్ ఎస్60 వెర్షన్, 2.1 ఎక్లైర్, 2.2 ఫ్రోయో, విండోస్ ఫోన్
7.1 టోటింగ్ డివైజ్ లకు ఈ ఏడాది చివరి నుంచి వాట్సాప్ సర్వీసులు
ఆపివేస్తున్నామని సంస్థ యజామన్యం చెప్పింది.

No comments:
Post a Comment